భారతదేశం, నవంబర్ 6 -- సడెన్ గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది ప్రియదర్శి లేటెస్ట్ కామెడీ థ్రిల్లర్ 'మిత్ర మండలి'. 20 రోజుల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది ఈ ఫిల్మ్. ఓ అమ్మాయిని ప్రేమించే నలుగురు యువకులు చూట్టూ తిరిగే కథ ఇది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందో చూసేయండి.

ప్రియదర్శి లీడ్ రోల్ లో నటించిన కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మిత్ర మండలి. ఈ సినిమా ఇవాళ (నవంబర్ 6) సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో ప్రియదర్శితో పాటు నిహారిక ఎన్ఎమ్, విష్ణు ఓఐ, రాగ్ మమూర్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిశోర్, సత్య తదితరులు నటించారు.

మిత్ర మండలి సినిమా థియేటర్లో రిలీజైన 20 రోజుల్లోనే ఓటీటీలోకి రావడం గమనార్హం. ఈ మూవీ అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. అయితే థియేటర్లో ఈ సినిమా అనుకున్నంత ఆడలేదు. మరోవైపు తెలుసు కదా, డ్యూ...