భారతదేశం, డిసెంబర్ 7 -- విరాట్ కోహ్లీ ప్రస్తుతం 84 అంతర్జాతీయ సెంచరీల మైలురాయిని అందుకున్నాడు. టెస్టుల్లో 30, వన్డేల్లో 53, టీ20ల్లో ఒక శతకం చొప్పున చేశాడు. సచిన్ టెండూల్కర్ సాధించిన 100 సెంచరీల అద్భుతమైన రికార్డుకు ఇంకా 16 సెంచరీలు దూరంలో ఉన్నాడు కోహ్లి. కాగితంపై చూస్తే ఈ దూరం తక్కువగా అనిపించవచ్చు. అయితే అసలు ప్రశ్న ఏమిటంటే.. 37 ఏళ్ల వయసులో టెస్టులు, టీ20ల నుంచి రిటైర్ అయి, కేవలం వన్డేలపైనే దృష్టి సారించిన కోహ్లీ.. వాస్తవంగా ఎంతకాలం పాటు అత్యుత్తమ ప్రదర్శన చేయగలడు?

ప్రస్తుతం కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న కోహ్లి సూపర్ ఫామ్ లో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ లో రెండు సెంచరీలు, ఓ అర్ధ శతకం సాధించాడు. కోహ్లీ కేవలం వన్డేల్లోనే 296 ఇన్నింగ్స్‌లలో 14,557 పరుగులు సాధించాడు. అతని సగటు 58.70. వన్డేల్లో 53 సెంచరీలు ఉన్నాయి. అంటే ప్రత...