భారతదేశం, ఫిబ్రవరి 24 -- అంపైర్ స్టీవ్ బక్నార్.. ఈ తరం క్రికెట్ ఫ్యాన్స్ ఈయన గురించి తెలిసి ఉండదు. కానీ 1990, 2000ల్లో క్రికెట్ అంటే పడిచచ్చే అభిమానులకు ఈ అంపైర్ గురించి, సచిన్ టెండూల్కర్ విషయంలో అతనిచ్చిన వివాదాస్పద ఔట్ల గురించి బాగానే తెలిసి ఉంటుంది. భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఒకానొక సమయంలో స్టీవ్ బక్నార్ పై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు కూడా. అయితే ఇప్పుడు స్టీవ్ తన తప్పు ఒప్పుకొన్నాడు.

79 ఏళ్ల స్టీవ్ బక్నార్ 120 పైగా టెస్టుల్లో అంపైరింగ్ చేశాడు. ప్రపంచకప్ ల్లోనూ అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ విషయంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే అంపైర్ గా నిలిచాడు. ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన మ్యాచ్‌లలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగానే ఉన్నాయి.

ఆస్ట్రేలియాతో జరిగిన బ్రిస్బే...