Hyderabad, ఏప్రిల్ 28 -- జీవితంలో అనుకున్నది సాధించడమే విజేతగా మారడమంటే. విజయం సాధించాలంటే ఎంతో కష్టపడాలి. పట్టుదల, సంకల్ప బలం ఉండాలి. తమ అలవాట్లను మెరుగుపరచడం ద్వారా విజయానికి మార్గాన్ని మీరే వేసుకోవాలి. మీకు 30 ఏళ్ల వయసు రావడానికి ముందే కొన్ని అలవాట్లను వదిలేయాలి. అలా అయితే మీరు విజేతగా కచ్చితంగా నిలుస్తారు.

మీరు త్వరలో 30 ఏళ్లు నిండుతున్నట్టయితే జీవితంలో విజయం సాధించడానికి వెంటనే ఈ అలవాట్లను విడిచిపెట్టండి. ఈ అలవాట్లు మిమ్మల్ని విజయానికి దూరంగా ఉంచుతాయి. వాటి గురించి తెలుసుకుందాం.

కొందరికి అన్ని విషయంలో పర్షెక్షన్ గా ఉండాలని కోరుకుంటారు. అలా ఉండాలనే ధ్యాసతో తమలో తామే నలిగిపోతారు. దీని వల్ల మీరు ఒత్తిడి, ఆందోళనతో ఇబ్బంది పడతారు. అటువంటి పరిస్థితిలో, మీరు పర్ఫెక్షన్ పై కాకుండా పని సరిగ్గా చేయడంపై మాత్రమే దృష్టి పెట్టాలి. పర్ఫెక్షన్ కోస...