Telangana,hyderabad, ఆగస్టు 21 -- రాష్ట్ర వ్యాప్తంగాఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

గచ్చిబౌలిలోని 3 ఎకరాల విస్తీర్ణంలో రూ. 30 కోట్ల వ్యయంతో 3 ఫ్లోర్ ల భవన నిర్మాణం ఉండనుంది. రోజుకు 250 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరిగేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఒక్కో ఇంటిగ్రేటెడ్ కార్యాలయంలో 6 గురు SRO లు, ఒక DRO, ఒక DIG ఉండనున్నారు. వెయిటింగ్ హాల్, మహిళల కోసం ప్రత్యేక హాల్, ఫీడింగ్ రూమ్, చిన్నపిల్లల కోసం క్రష్ సెంటర్, కేఫ్, వృద్దుల కోసం ర్యాంప్,వీల్ చైర్ సదుపాయాలు ఉంటాయి. గ్రీన్ బిల్డింగ్ తో పాటు 300 కార్లకు పార్కింగ్ సదుపాయం ఉంటుంది.

మొదటి దశలో GHMC కోర్ అ...