భారతదేశం, జూలై 21 -- సంపన్న దేశాల్లో ప్రజలు వ్యాయామం ఎక్కువగా చేస్తున్నా, ఎక్కువ కేలరీలు ఖర్చు చేస్తున్నా.. స్థూలకాయం (obesity) మాత్రం పెరుగుతోంది. ఇది నిజంగా విచిత్రమైన పరిస్థితి. ఇంతకీ దీనికి కారణం ఏంటి? ఎక్కువ కష్టపడుతున్నా, ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తున్నా బరువు ఎందుకు పెరుగుతున్నారు? దీనికి సమాధానం వారి వ్యాయామంలో కాదు.. వారి ఆహారపు అలవాట్లలోనే ఉంది అంటున్నారు నిపుణులు.

సాధారణంగా స్థూలకాయానికి శారీరక శ్రమ లేకపోవడం ప్రధాన కారణం అని చాలామంది నమ్ముతారు. అయితే, డ్యూక్ యూనివర్సిటీ మార్చి 31న ఆవిష్కరించిన ఒక అధ్యయనం ఈ నమ్మకాన్ని సవాల్ చేస్తోంది. ఈ అధ్యయనం కోసం 34 ప్రాంతాల్లోని 4,200 మందికి పైగా ప్రజలను పరిశీలించారు. ఆశ్చర్యకరంగా, అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రజలు సాంప్రదాయ సమాజాల్లోని ప్రజల కంటే రోజుకు ఎక్కువ కేలరీలను ఖర్చు చేస్తున్నారని ...