భారతదేశం, అక్టోబర్ 29 -- సందీప్ రెడ్డి వంగా.. ఈ సంచలన డైరెక్టర్ మేకింగ్ స్టైలే వేరు. అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ వరకు అతని సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. హీరోలను బోల్డ్ గా చూపించడానికి సందీప్ అస్సలు వెనుకాడడు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా తెరకెక్కించనున్న స్పిరిట్ మూవీలోనూ సందీప్ మరోసారి బోల్డ్ సీన్లతో రాబోతున్నడానే బజ్ ఇంట్రెస్ట్ కలిగిస్తోంది.

ప్రభాస్ అభిమానులు మరోసారి ఉత్సాహంతో ఊగిపోతున్నారు, కానీ ఈసారి ఆయన యాక్షన్ సన్నివేశాల వల్ల కాదు. సందీప్ రెడ్డి వంగా రాబోయే చిత్రం 'స్పిరిట్' ఆడియో టీజర్ ఆన్‌లైన్‌లో ఒక సంచలనాన్ని సృష్టించింది. ఆ టీజర్‌లోని ఒకే ఒక్క బోల్డ్ డైలాగ్ తో డార్లింగ్ ముందెన్నడూ ప్రయత్నించని సాహసోపేతమైన సన్నివేశం ఉండబోతోందనేది తెలుస్తోంది.

ప్రభాస్ 46వ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన స్పిరిట్ ఆడియో టీజర్ వైరల్ గా మా...