Hyderabad, జూలై 26 -- తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన బోల్డ్ లవ్ రొమాంటిక్ డ్రామా చిత్రం విజయ్ దేవరకొండ విడుదలకు ముందు ఎన్ని విమర్శలు ఎదుర్కొన్న రిలీజ్ అయ్యాక అంతకుమించిన ప్రశంసలు పొందింది.

దాంతో దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత అదే సినిమాను హిందీలో కబీర్ సింగ్‌గా రీమేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్‌లో కూడా సాలిడ్ హిట్ అందుకున్నారు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగా మూవీ వస్తోందనే అనౌన్స్‌మెంట్‌తోనే అంచనాలు పెంచింది యానిమల్.

ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మాస్ ఆడియెన్స్‌ను అమితంగా కట్టిపడేసింది యానిమల్ మూవీ. కొన్ని వర్గాల నుంచి యానిమల్ మూవీపై విమర్శలు వచ్చిన సందీప్ రెడ్డి వంగా టేకింగ్, డైలాగ్స్, మ్యూజిక్ టేస్ట్‌పై ప్రశంసలు కుర...