భారతదేశం, డిసెంబర్ 28 -- రాజా సాబ్ సినిమాతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తోంది హీరోయిన్ నిధి అగర్వాల్. రాజా సాబ్ చిత్రంలో ప్రభాస్ తో ఆడిపాడిన ముగ్గురు హీరోయిన్లలో ఆమె ఒకరు. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఎక్స్ (ట్విటర్)లో ఫ్యాన్స్ ప్రశ్నలకు సమాధానాలిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది నిధి అగర్వాల్

నిధి అగర్వాల్ చివరగా పవన్ కల్యాణ్ తో హరి హర వీరమల్లులో కనిపించింది. ఇప్పుడు ప్రభాస్ తో రాజా సాబ్ చేసింది. రాజా సాబ్ ప్రమోషన్లలో భాగంగా ఆదివారం (డిసెంబర్ 28) సాయంత్రం ఎక్స్ లో ఫ్యాన్స్ తో ముచ్చటించింది నిధి. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఈ క్రమంలోనే ప్రభాస్, పవన్ కల్యాణ్ మల్టీ స్టారర్ లో నటించాలని ఉందని పెద్ద కోరికే బయటపెట్టింది.

ఎక్స్ లో ఫ్యాన్స్ అడ...