Hyderabad, జూలై 16 -- అర్జున్ రెడ్డితో సంచలనం రేపి, ఆ తర్వాత టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగిన సందీప్ రెడ్డి వంగాకు ఓ కొత్త అభిమాని దొరికాడు. అతడు ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ మోహిత్ సూరి. అతనికి మద్దతుగా నిలవడమే కాదు.. తాను అభిమానిని అని కూడా చెప్పాడు.

సందీప్ కథన శైలిని ప్రశంసిస్తూ.. 'యానిమల్' తనకు నచ్చిందని కూడా స్పష్టం చేశాడు. సమకాలీన సినిమా పరిస్థితి, సందీప్ వంగా సినిమాలపై ఎంతో మంది స్పందన గురించి మాట్లాడుతూ.. అతని సినిమాల చుట్టూ ఉన్న వివాదం అనవసరమని మోహిత్ సూరి అన్నాడు.

సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఫిల్మీగ్యాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ డైరెక్టర్ మోహిత్ సూరి మాట్లాడుతూ.. సందీప్ వంగా కథనాల చుట్టూ జర...