Hyderabad, ఆగస్టు 4 -- సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 కర్టెన్ రైజర్ ఈవెంట్‌ శనివారం (ఆగస్ట్ 2) సాయంత్రం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో సీనియర్ నటులు మురళీ మోహన్, నిర్మాత కేఎస్ రామారావు, ఫిల్మ్ నగర్ హోసింగ్ సొసైటీ సెక్రటరీ కాజా సూర్యనారాయణ, నిర్మాత ఏడిద రాజా, రామ సత్యనారాయణ, స్పాన్సర్స్ సూర్య సెమ్ డైరెక్టర్స్ అనిల్, డా. సురేష్ బాబు, వీవీకే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత వళ్లూరు విజయకుమార్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.

అలాగే ఈ కార్యక్రమానికి శ్రీ విజయ వారాహి మూవీస్ సంస్థ కో స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్ పాట్‌నర్‌గా ఆదిత్య మ్యూజిక్ వ్యవహరిస్తుంది. ఈ సందర్భంగా అతిథులు చేతుల మీదుగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 ...