Hyderabad,telangana, ఆగస్టు 3 -- ఐవీఎఫ్, సరోగసీ ముసుగులో నడుస్తున్న శిశువుల విక్రయ రాకెట్ హైదరాబాద్ పోలీసులు ఛేదించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ ఐవీఎఫ్ క్లినిక్లు, సంతానోత్పత్తి కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించేందుకు ప్రభుత్వం శనివారం కమిటీని ఏర్పాటు చేసింది.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ పర్యవేక్షించే ఈ కమిటీ . సంతాన సాఫల్య కేంద్రాల సేవల విషయంలో. చట్టపరమైన, క్లినికల్ మరియు నైతిక ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది.

రాష్ట్రంలో కొన్ని ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) క్లినిక్ లు, సంతానోత్పత్తి కేంద్రాలు.. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) యాక్ట్ 2021, సరోగసీ (రెగ్యులేషన్) చట్టం 2021 నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చింది....