Hyderabad, ఆగస్టు 4 -- ఏకాదశి విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించి, విష్ణువు అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే కూడా ఎంతో మంచిది. ఇక శ్రావణ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశినే "శ్రావణ పుత్రదా ఏకాదశి" అని పిలుస్తారు.

పుత్రదా ఏకాదశి సంవత్సరానికి రెండుసార్లు వస్తుంది. ఒకటి శ్రావణమాసంలో, మరొకటి పుష్య మాసంలో. ఈ రెండు ఏకాదశుల రోజున ఉపవాసాలు ఉంటే, సంతాన భాగ్యం కలుగుతుంది. ఇక మరి ఈసారి శ్రావణమాసంలో వచ్చే పుత్రదా ఏకాదశి ఎప్పుడు వచ్చింది? ఆ రోజు ప్రాముఖ్యత ఏంటి? పూజా విధానం, పూజ సమయం మొదలైన వివరాలను తెలుసుకుందాం.

ఈ ఏడాది శ్రావణ పుత్రదా ఏకాదశి ఆగస్టు 5న వచ్చింది. ఏకాదశి తిధి ఆగస్టు 4 ఉదయం 11:41కి మొదలవుతుంది, ఆగస్టు 5 మధ్యాహ్నం 1:12తో ముగుస్తుంది. ఏకాదశిని ఉదయ తిధి ప్రకారం చూడాలి ...