భారతదేశం, జూలై 22 -- తల్లిదండ్రులు కావాలని కలలు కంటున్నారా? అయితే, గర్భధారణ ప్రయాణం ఆశ, ఆనందం, ఉత్సాహంతో పాటు కొంత ఆందోళన, తప్పుడు సమాచారంతో కూడుకున్నది కావొచ్చు. ముఖ్యంగా లైంగిక సంబంధం, గర్భధారణ గురించి చాలా అపోహలు ప్రచారంలో ఉన్నాయి. చాలామంది దంపతులు తెలియకుండానే శాస్త్రీయంగా తప్పుదారి పట్టించే సలహాలను నమ్మి, అనవసర ఒత్తిడికి, నిరాశకు గురవుతుంటారు.

గురుగ్రామ్‌లోని క్లౌడ్‌నైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌లో సీనియర్ కన్సల్టెంట్ - ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ రచిత ముంజాల్ హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, సంతానోత్పత్తికి ఆటంకం కలిగించే కొన్ని సాధారణ లైంగిక అపోహలను తొలగించారు.

సంతానం కోసం ప్రయత్నిస్తున్న దంపతుల్లో ఇది చాలా సాధారణ అపోహ. సమయం ముఖ్యమే అయినా, అవసరానికి మించి తరచుగా కలవడం అవసరం లేదు. సైన్స్ ఏం చెబుతుందంటే, అండం విడుదలైన తర్...