భారతదేశం, డిసెంబర్ 26 -- లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ దురంధర్ హిస్టరీ తిరగరాస్తూనే ఉంది. బాక్సాఫీస్ ను బద్దలు కొడుతూ రికార్డుల మోత మోగిస్తోంది. ర‌ణ్‌వీర్ సింగ్‌ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ తాజాగా రూ.1000 కోట్ల క్లబ్ లో చేరింది. 21 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది.

డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఆదిత్య ధర్ దర్శకత్వంలోని దురంధర్ మూవీ బాక్సాఫీస్ ఊచకోత కొనసాగుతోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ మూవీ ఇప్పటికే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మూడవ వారం కూడా క్రిస్మస్ రోజున భారీ వసూళ్లను రాబట్టిన ఈ స్పై థ్రిల్లర్ రూ.1000 కోట్ల క్లబ్ లో చేరింది.

దురంధర్ మూడో వారం కూడా బాక్సాఫీస్ దగ్గర తన సత్తాచాటుతోంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఈ సినిమాకు భారీ వసూళ్లు దక్కాయి. గురువారం ఈ సినిమా కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే నటిం...