భారతదేశం, ఆగస్టు 18 -- వివేక్ అగ్నిహోత్రి 'ఫైల్స్ ట్రైలాజీ'లో మూడవ చిత్రం బెంగాల్ ఫైల్స్. మిగిలిన రెండు సినిమాలు ది కాశ్మీర్ ఫైల్స్, ది తాష్కెంట్ ఫైల్స్. ఈ రెండు చిత్రాలు అనేక సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ చివరికి విడుదలయ్యాయి. అదేవిధంగా, ది బెంగాల్ ఫైల్స్ కూడా సంచలనం సృష్టించింది. ఈ చిత్రం డైరెక్ట్ యాక్షన్ డే, 1946 కలకత్తా ఊచకోత, నోహ్ఖాలి అల్లర్ల నిజ జీవిత సంఘటనలపై దృష్టి సారిస్తుందని ట్రైలర్ చూపిస్తుంది. ఈ చిత్రం భారతీయ చరిత్రలోని 'అత్యంత క్రూరమైన అధ్యాయాన్ని' వెలికి తీయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి నటించారు.

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ది బెంగాల్ ఫైల్స్ సెప్టెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదల కానుంది. ఓటీటీలో ఉన్న ఇలాంటి రియల్ లైఫ్ కాంట్రవర్సీ సినిమాలపై ఓ లుక్కేయ...