Hyderabad, సెప్టెంబర్ 20 -- టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన శివ సినిమా రీ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని కింగ్ నాగార్జున అధికారికంగా ప్రకటించారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి సందర్భంగా ఈ విషయాన్ని నాగార్జున చెప్పారు. 1989లో విడుదలైన 'శివ' సినిమా ఎంతటి కల్ట్ హిట్‌గా నిలిచిందో తెలిసిందే.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివ సినిమాను 4కేతోపాటు డాల్బీ అట్మోస్‌లో థియేటర్లలోకి రానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మించిన శివ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టి ప్రశంసలు పొందింది. నాగార్జున నటించిన శివ 36 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కానుంది. ఈ ఏడాది నవంబర్ 14న శివ మూవీని రీ రిలీజ్ చేయనున్నారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. "తరతరాలుగా జీవించే శక్తి సినిమాకు ఉందని మా నాన్నగారు ఎప్పుడూ నమ్మేవారు. నవంబర్ 14న 4K డా...