భారతదేశం, నవంబర్ 22 -- వైవిధ్యమైన సినిమాలతో హీరోగా తనదైన గుర్తింపు దక్కించుకున్న రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. సినిమాల్లో హీరోగా, విలన్‌గా అదరగొట్టిన మంచు మనోజ్ సంగీత పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు.

అందులో భాగంగా మంచు మనోజ్ తన కొత్త మ్యూజిక్ ప్రాజెక్ట్ 'మోహన రాగ మ్యూజిక్'ను ప్రారంభించబోతున్నట్లు తాజాగా ఇవాళ (నవంబర్ 22) అధికారికంగా ప్రకటించారు. ఈ అనౌన్స్‌మెంట్ ఆయ‌న‌కు, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ఓ ఎమోష‌న‌ల్ మైల్ స్టోన్ అని తెలుస్తోంది.

వెండితెరపై తనదైన నటన, పాత్రలతో విలక్ష‌ణ న‌టుడుగా తెలుగు సినిమాల్లో ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్నారు మంచు మ‌నోజ్‌. చైల్డ్ ఆర్టిస్ట్‌గా త‌న ప్ర‌యాణాన్ని ప్రారంభించారు. బిందాస్‌, క‌రెంట్ తీగ‌, పోటుగాడు వంటి మాస్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌తోపాటు ప్ర‌యోగ్రాత్మ‌క చిత్రాల్లోనూ న‌టించి ...