భారతదేశం, మే 25 -- తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు మహిళలు డ్రోన్ల ద్వారా వ్యవసాయం చేస్తూ 'డ్రోన్ దీదీ'లుగా ప్రసిద్ధి చెందారు. వీరి గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. మహిళలను 'స్కై వారియర్స్'గా సంబోధించారు. ప్రధాని మోదీ తమ గురించి మాట్లాడడంపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు.

సంగారెడ్డి జిల్లా మహిళల గురించి 'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంతో సమయం, డబ్బు ఆదా చేస్తున్నారని మహిళలను మోదీ ప్రశంసించారు.

సంగారెడ్డి మహిళలు డ్రోన్లను సమర్థవంతంగా వినియోగిస్తున్నారు, మిగతా ప్రాంతాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని సూచించారు. వ్యవసాయరంగంలో డ్రోన్ల వినియోగం వల్ల కూలీల కొరతను అధిగమించొచ్చని ప్రధాని మోదీ సూచించారు.

మన్‌ కీ బాత్ కార్యక్...