భారతదేశం, డిసెంబర్ 28 -- సంగారెడ్డి జిల్లాలో కల్వర్టు గుంతలో పడి ముగ్గురు మృతి ప్రాణాలు కోల్పోయారు. బైకుపై వెళ్తూ నిర్మాణంలో ఉన్న పడిపోగా ఈ ఘటన జరిగింది. నారాయణఖేడ్ శివారులోని నిజాంపేట్-బీదర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

ప్రాథమిక వివరాల ప్రకారం.. నారాయణఖేడ్‌ మండలం నర్సాపూర్‌ గ్రామానికి చెందిన అవుటి నర్సింహులు(27), జిన్న మల్లేష్(24), జిన్న మహేష్‌(23) అనే ముగ్గురు యువకులు నారాయణపేట నుంచి నర్సాపూర్‌ వైపు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలోనే నిజాంపేట-బీదర్‌ జాతీయ రహదారిపై కొత్తగా నిర్మిస్తున్న 160బి హైవేపై కల్వర్టు కోసం తవ్విన గుంతలో పడిపోయారు.

కల్వర్టు గుంతలో పడిన ముగ్గురు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

నూతనంగా నిర్మిస్తు...