భారతదేశం, మే 5 -- సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడంతో మనస్తాపానికిి గురైన భర్త ఇద్దరు పిల్లల్ని చంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలకు ఉరి వేసి చంపి ఆపై ఉరి వేసుకుని తండ్రి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన సుభాష్ తన ఇద్దరు పిల్లలు పదమూడేళ్ల మారిన్, పదేళ్ల ఆరాధ్యలను ఉరి వేసి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుభాష్ భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడంతో మపస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.