భారతదేశం, జూన్ 30 -- సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో ఈరోజు (జూన్ 30, 2025) రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురు కార్మికులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. ఐదుగురు దుర్ఘటన స్థలంలో చనిపోయారని, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. మరికొందరు కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారికి సమీపంలోని ఇస్నాపూర్, చందానగర్ ఆసుపత్రుల్లో అందిస్తున్నారు.

ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని కొన్ని భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మంటలు పక్కనున్న ప్రాంతాలకు విస్తరించకుండా అగ్నిమాపక సి...