భారతదేశం, డిసెంబర్ 28 -- సంక్రాంతి వచ్చిందంటే తెలుగు సినీ ప్రేమికులకు నిజమైన పండగ వస్తుంది. ఏ ఏడాదైనా సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర సందడి ఉంటుంది. వచ్చే సంక్రాంతికి ఆ సందండి డబుల్ కానుంది. ఎప్పుడూ లేనట్లుగా 2026 సంక్రాంతికి ఎక్కువ సంఖ్యలో, అది కూడా భారీ స్థాయి సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇందులో రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు లాంటి చిత్రాలున్నాయి.

2026 సంక్రాంతి పండగ రాజా సాబ్ సినిమాతో స్టార్ట్ అవుతుంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ జనవరి 9న రిలీజ్ కానుంది. ఇందులో ప్రభాస్ తో పాటు సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ తదితరులు నటించారు. మారుతి డైరెక్టర్. ఈ సినిమాతో ప్రభాస్ మరో కోణాన్ని చూస్తారని డైరెక్టర్ మారుతి బలంగా చెప్పాడు.

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ లాస్ట్ మూవీ జన నాయకుడు. రాజకీయాల్లో అడుగుప...