భారతదేశం, జనవరి 16 -- మేడారానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం ఉదయం నుంచే వెళ్లే వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. మేడారం వైపు రహదారులన్నీ రద్దీగా మారాయి. దీంతో సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. జాగారం నుంచి మేడారం వరకు వాహనాల రద్దీ ఉండగా. కన్నెపల్లి, జంపన్నవాగు, హరిత హోటల్ వరకు ట్రాఫిక్ రద్దీ నెలకొంది.

మేడారంలో ఒక్కసారిగా రద్దీ పెరగటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొలాల్లో పార్కింగ్ కోసం వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఇక ములుగు గట్టమ్మ తల్లి ఆలయం వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

మరోవైపు మేడారంలో అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నారు. ఈ ఏడాది దాదాపు మూడు కోట్ల మంది భక్తులు మేడారం జాతరకు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. జాతర సంబంధిత సమాచ...