భారతదేశం, డిసెంబర్ 28 -- రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి ది రాజా సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో మెరిశాడు. ఈ ఈవెంట్ శనివారం (డిసెంబర్ 27) రాత్రి హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే. ఇందులో పాల్గొన్న ప్రభాస్.. తనదైన స్టైల్లో డార్లింగ్స్ అంటూ మాట్లాడాడు. మూవీతోపాటు సంక్రాంతి సినిమాలు, డైరెక్టర్ మారుతి, సీనియర్ హీరోల గురించి కూడా అతడు మాట్లాడిన విధానం అభిమానులను బాగా ఆకట్టుకుంది.

డార్లింగ్స్ ఎలా ఉన్నారు అంటూ ది రాజా సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో తన స్పీచ్ మొదలుపెట్టాడు ప్రభాస్. సంక్రాంతి సినిమాలన్నీ హిట్ కావాలని అతడు కోరుకున్నాడు. తమ సినిమా కూడా అయితే బాగుంటుంది అంటూ సింపుల్ గా చెప్పడం చాలా మందిని ఆకర్షించింది.

ఈసారి సంక్రాంతికి చిరంజీవి మూవీ మన శంకరవరప్రసాద్ గారు కూడా రిలీజ్ అవుతున్న విషయం తెలుసు కదా. బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియాగా ఫ్యాన్స్ అభివర...