భారతదేశం, జనవరి 14 -- ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలకు వెళ్లాలి అనుకునేవారు చాలా మంది ఉంటారు. కోడి పందేల కోసమే ఇక్కడకు వస్తుంటారు. అందుకు తగ్గట్టే ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఏర్పాట్లు కూడా ఉంటాయి. వేరే రాష్ట్రాల నుంచి కూడా సంక్రాంతి సంబురాలకు ఇక్కడకు జనాలు వస్తుంటారు. దీంతో హోటళ్లు కిక్కిరిసిపోతాయి. అంతేకాదు హోటల్ యజమానులు రేట్లను డబుల్ చేసి బస చేసేందుకు ఇస్తున్నారు. అయినా కూడా జనాలు అద్దెకు తీసుకుంటున్నారు.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్యంగా భీమవరం సంక్రాంతి ఉత్సవాలకు అలాగే కోడి పందేలకు ప్రధాన కేంద్రం అని చెప్పవచ్చు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి సుదూర ప్రాంతాల నుండి చాలా మంది తమ బంధువులు, స్నేహితుల ఇళ్లకు వచ్చారు. కొందరు గోదావరి జిల్లాల్లో ఉన్న హోటళ్లలో...