భారతదేశం, డిసెంబర్ 24 -- రానున్న సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని ఏపీ ఆప్కో మరోసారి శుభవార్త చెప్పింది. సంబంధిత షో రూమ్ ల్లో భారీ డిస్కౌంట్ తో అమ్మకాలు చేయనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. 60, 50, 40 శాతాల డిస్కౌంట్ ల పై చేనేత వస్త్రాలను విక్రయించనున్నామని, ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

తిరుమల వెంకన్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా తిరుపతిలో చేనేత బజార్ నిర్వహించనున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు. మరో రెండ్రోజుల్లో చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాలను కొనుగోలు చేస్తామని తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించిన ఆమె. మెగా క్లస్టర్ల ఏర్పాటు, గడిచిన మూడు నెలల్లో ఆప్కో అమ్మకాలపై మంత్రి ఆరా తీశారు.

ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ. రానున్న సంక్రాంతి దృష్టిలో ...