భారతదేశం, జనవరి 13 -- సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేసిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) విశాఖపట్నం-విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. రిజర్వేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. పండుగను జరుపుకోవడానికి స్వస్థలాలకు వచ్చే ప్రజలు ఎదుర్కొంటున్న ప్రయాణ ఇబ్బందులను తగ్గించడం దీని లక్ష్యం అని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం వంటి కీలక స్టేషన్లలో ఆగుతాయి, ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి వచ్చే ప్రయాణికులకు ఈ ప్రత్యేక రైళ్లు ఉపయోగపడనున్నాయి.

ఈ ప్రత్యేక సర్వీసులు జనవరి 12, 13, 14, 16, 17, 18 తేదీలలో నడుస్తాయి. ముఖ్యంగా పండుగకు సరిగ్గా ముందు ప్ర...