భారతదేశం, జనవరి 13 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) సంక్రాంతి పండుగ కోసం విస్తృతమైన ఏర్పాట్లను చేపట్టింది. పండుగ సీజన్‌లో ప్రయాణాన్ని సజావుగా సాగేలా విశాఖపట్నం నుండి 1,500 అదనపు బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు ప్రకటించింది.

పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ప్రతి సంవత్సరం ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామని, ఈ సంవత్సరం కూడా నడుపుతున్నట్టుగా ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి.అప్పల నాయుడు తెలిపారు. విశాఖపట్నం నుండి విజయవాడ, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాలతో సహా ప్రధాన గమ్యస్థానాలకు 1,500 అదనపు బస్సు సర్వీసులను నడపడానికి ప్రణాళికలు వేశారు.

సంక్రాంతి వేడుకలకు ఇంటికి వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ సేవలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. విశాఖపట్నం నగరంలో డిపో మేనేజర్లతో సమీక్షా సమ...