భారతదేశం, జనవరి 10 -- సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. ఓవైపు బస్టాండ్లలో. మరోవైపు రైల్వే స్టేషన్లలో రద్దీ కనిపిస్తోంది. సొంత ఊర్లకు వెళ్లేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. రద్దీ పరిస్థితుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన వివరాల ప్రకారం.. కొన్ని హైదరాబాద్ - విజయవాడ మధ్య నడవనున్నాయి. మరికొన్ని హైదరాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య సేవలు అందించనున్నాయి. పండగకు ముందు, తర్వాతి రోజుల్లో ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.

హైదరాబాద్ - కాగజ్ నగర్ మధ్య జనవరి 11, 12 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ ట్రైన్స్ హైదరాబాద్ నుంచి ఉదయం 7.55 నిమిషాలకు బయల్దేరి... మధ్యాహ్నం 2.15 నిమిషాలకు కాగజ్ నగర్ చేరుకుంటాయి.

కాగజ్ నగర్ - హైదరాబాద్ మధ్య జనవరి 10, 11 తే...