భారతదేశం, డిసెంబర్ 25 -- సంక్రాంతి పండుగ కోసం దక్షిణ మధ్య రైల్వే అదనపు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. కాకినాడ, వికారాబాద్, నాందేడ్, మచిలీపట్నం మధ్య రైళ్లు నడుస్తాయి. విజయవాడ, సికింద్రాబాద్, రాజమండ్రి వంటి ప్రధాన స్టేషన్లలో కూడా ఆగుతాయి. ప్రయాణికులు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

రైలు నెం. 07450 కాకినాడ టౌన్ - వికారాబాద్ జనవరి 19న సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు చేరుకుంటుంది. రైలు నెం. 07451 వికారాబాద్ - కాకినాడ టౌన్ జనవరి 20న ఉదయం 9 గంటలకు బయలుదేరి రాత్రి 9.15 గంటలకు చేరుకుంటుంది.

కాకినాడ టౌన్ - వికారాబాద్ - కాకినాడ టౌన్ స్పెషల్‌లు.. సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్లలో రెండు వైపులా ఆగుతాయి.

రైలు న...