భారతదేశం, జనవరి 14 -- సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మాడనూరు పెద్దపాలెం గ్రామంలో మత్స్యకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మత్స్యకారులకు బోట్‌ రేస్‌, ఈత, రంగోలీల పోటీలు నిర్వహించారు. బోట్ రేస్ పోటీలో 14 జట్లు పాల్గొన్నాయి. ఒక్కో బోటులో ఇద్దరు చొప్పున మొత్తం 28 మంది ఉన్నారు. మడనూరు, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఇక్కడికి వచ్చారు.

పట్టపుపాలెం, పెద పట్టపుపాలెం, ఈతముక్కల పల్లె పాలెం, వాజిరెడ్డి పాలెం, మదనూరు పాలెంపాలెం, మాడనూరు తదితర మత్స్యకార గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఈ పడవ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సముద్రంలో పడవ పోటీలు కన్నుల పండువగా నిర్వహించారు. 14 పడవల్లో మత్స్యకారులు ఉత్సహంగా పోటీల్లో పాల్గొన్నారు.

ఈ పోటీల్లో భాగంగా సముద్రంలో 500 మీటర్ల దూరంలో ఉన్న జెండాను తీసుకు వచ్చి తీరం వద్దకు రా...