భారతదేశం, జనవరి 12 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారి జీవితాల్లో చాలా మార్పులను కలిగిస్తుంది. త్వరలోనే సంక్రాంతి పండుగ రాబోతోంది. సంక్రాంతి పండుగను సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు జరుపుకుంటాము. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే సమయంలో శుక్రుడు కూడా మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.

ధనస్సు రాశిలో కుజుడు, బుధుడు సంయోగం చెందుతారు. అలాగే ఆ రోజు వృద్ధి యోగం, రవి యోగం కూడా ఏర్పడబోతున్నాయి. గురు, చంద్రుల గజకేసరి రాజయోగం కూడా ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారు ధనవంతులు కాబోతున్నారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరో చూద్దాం.

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర రాశి వారికి ఈ రాజయోగం మొదలవుతుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారి కోరికలు నెరవేరుతాయి. వ్యాపారం చేయాల...