భారతదేశం, నవంబర్ 26 -- కోనసీమ జిల్లాలో పల్లె పండుగ 2.0లో భాగంగా పవన్ కల్యాణ్ పర్యటించారు. రాజోలు నియోజకవర్గం పరిధిలోని కేశవదాసుపాలెం వద్ద శంకరగుప్తం, కేశనపల్లి డ్రెయిన్ నుంచి సముద్రపు నీరు పోటెత్తడం కారణంగా పాడైన కొబ్బరి పంటను పరిశీలించారు. మోడుబారిన కొబ్బరి చెట్ల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు.

కొబ్బరి చెట్టుని నమ్ముకున్న వాళ్లు రోడ్డున పడకూడదని పవన్ చెప్పారు. కొబ్బరి రైతు రోడ్డు ఎక్కకూడదన్నారు. కోనసీమ కొబ్బరి రైతుల సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసి, శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. 45 రోజుల్లో కొబ్బరి రైతుల సమస్యకు శాశ్వత పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని, సంక్రాంతి తర్వాత యాక్షన్ ప్లాన్ తో మీ ముందుకు వస్తానని తెలిపారు. కోనసీమ కొబ్బరి రైతుకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చ...