భారతదేశం, జనవరి 15 -- నిషేధం, పదే పదే హెచ్చరికలు ఉన్నప్పటికీ సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో కోడిపందేలు నిర్వహించారు. నిర్వాహకులు, పాల్గొనేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించినప్పటికీ, రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యక్తులు ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. కొన్ని ప్రాంతాల్లో కోడిపందేల్లో పందెం వేయడంతో పెద్ద ఎత్తున కరెన్సీ నోట్లు చేతులు మారాయి.

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, పోలవరం, కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో కోడి పందేలు జోరుగా సాగాయి. ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేశారు. కోడి పందేలు, జూదం కార్యకలాపాలను నిర్వహించవద్దని హెచ్చరికలు ఉన్నా.. ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు. ప్రముఖులు సైతం హాజరై సంబరాలు చేసుకున్నారు.

తెలంగాణతోపాటుగా ఇతర రాష్ట్రాల జనాలు కూడా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. కోడి పందేల బరుల వద్ద ఉత్స...