భారతదేశం, జనవరి 8 -- సంక్రాంతికి ముందు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు ప్రారంభమవుతున్నాయా? వాతావరణ శాఖ అవుననే చెబుతోంది. ఏపీలో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. తెలంగాణలో వాతావరణ మార్పులు కనిపిస్తాయి. బంగాళాఖాతంలో తుపానుకు అనుకూలమైన పరిస్థితుల కారణంగా దక్షిణాది రాష్ట్రాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు భావిస్తున్నారు.

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది గురువారం తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతుందని భావిస్తున్నారు. తుపానుగా మారితే భారీ వర్షాలు కురుస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వాయుగుండం తీరం వైపు కదులుతుంది, దీని వలన ఏపీ, తమిళనాడులో వర్షాలు కురుస్తాయి. అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున కొన్ని తమిళనాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పుదుచ...