భారతదేశం, జనవరి 6 -- జనవరి 9 నుంచి జనవరి 19వ తేదీ వరకు టీజీఎస్ఆర్టీసీ 6,500 ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో ప్రయాణికుల రద్దీ ఉంటుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సామర్థ్య ప్రణాళికను దశలవారీగా చేపట్టారు అధికారులు. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు.

తెలంగాణలోనే ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉండే దసరా పండుగలా కాకుండా.. సంక్రాంతి పండుగను ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున జరుపుకోవడం వల్ల, ఆ రాష్ట్రంలోని గమ్యస్థానాలకు గణనీయమైన ప్రయాణికుల రద్దీ ఉంటుందని అంచనా వేసింది ఆర్టీసీ.

ఆన్‌లైన్ ముందస్తు రిజర్వేషన్ల కోసం 1,500 బస్సులను కేటాయించారు. ఇప్పటికే దాదాపు 70 శాతానికిపైగా సీట్లు బుక్ అయ్యాయి. మిగిలినవి సంక్రాంతికి రెండు రోజుల ముందుగానే నిం...