భారతదేశం, జనవరి 6 -- సంక్రాంతి దగ్గరకు వచ్చింది. ఇక ఊర్లకు వెళ్లేందుకు జనాలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఆర్టీసీ కూడా స్పెషల్ బస్సులను నడిపిస్తోంది. సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని.. హైదరాబాద్ నగరంలో ఉండేవారికి సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.

సికింద్రాబాద్, లింగంపల్లి నుంచి నడిచే 16 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హైటెక్ సిటీ స్టేషన్‌లో, సికింద్రాబాద్ టూ విజయవాడ మార్గంలో నడిచే మరో 11 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు చర్లపల్లిలో ప్రత్యేకంగా హాల్ట్‌లను ఏర్పాటు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. ఈ సదుపాయం ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. దీంతో సంక్రాంతికి ఇంటికి వెళ్లేవారికి, తిరిగి వచ్చేవారికి స్పెషల్ ట్రైన్స్ ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

హైటెక్ సిటీలో మచిల...