భారతదేశం, ఏప్రిల్ 24 -- విజ‌య్ సేతుప‌తి ఏస్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. మే 23న ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. అదే రోజు ఈ మూవీ త‌మిళంతో పాటు తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ఇటీవ‌ల అఫీషియ‌ల్‌గా మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు.

ఏస్ మూవీలో రుక్మిణి వ‌సంత్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. యోగి బాబు, బి.ఎస్. అవినాష్, దివ్య పిళ్లై, బబ్లూ, రాజ్‌కుమార్ కీల‌క పాత్ర‌లు పోషిస్తోన్నారు. అరుముగ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ స్వ‌యంగా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నాడు.

ఏస్ మూవీ షూటింగ్ మొత్తం మ‌లేషియాలోనే జ‌రిగింది. లొకేష‌న్స్‌, విజువ‌ల్స్ ఆక‌ట్టుకుంటాయ‌ని మేక‌ర్స్ చెబుతోన్నారు. గ్రిప్పింగ్ యాక్ష‌న్ మూవీగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు ఆడియెన్స్‌కు ఈ మూవీ థ్రిల్లింగ్‌ను పంచుతుంద‌ని మేక‌ర్స్ పేర్కొన...