భారతదేశం, మే 22 -- ియోమీ కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. ఇందులో షియోమీ సివి 5 ప్రో, 15ఎస్ ప్రో ఉన్నాయి. ఈ రెండు ఫోన్ల గురించి వివరాలు ఏంటో తెలుసుకుందాం..

కొత్త షియోమీ సివి 5 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.55 అంగుళాల క్వాడ్-కర్వ్డ్ ఓఎల్ఇడి డిస్‌ప్లే ప్యానెల్ ఉంది. ఇది 1.5 కె రిజల్యూషన్, సెల్ఫీ కెమెరా కోసం పిల్ షేప్ కటౌట్ కలిగి ఉంది. 3200 నిట్స్ బ్రైట్‌నెస్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఈ స్క్రీన్ అందిస్తుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్‌సెట్, 16 జీబీ వరకు ఎల్పీపీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ ఉన్నాయి. షియోమీ హైపర్ ఓఎస్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉ...