భారతదేశం, మే 19 -- కింగ్‍డమ్ సినిమా షూటింగ్‍ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పూర్తి చేసుకున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. అయితే మే 30 నుంచి జూలై 4వ తేదీకి ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా విజయ్ దేవరకొండ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో, బాద్‍షా షారుఖ్ ఖాన్ గురించి మాట్లాడారు.

షారుఖ్ ఖాన్ నుంచి తాను స్పూర్తి పొందానని విజయ్ దేవరకొండ చెప్పారు. ఎవరో సక్సెస్ సాధిస్తే.. తాను ఎందుకు చేయలేనని అనిపించేదని చెప్పారు. "షారుఖ్ ఖాన్ సక్సెస్ నన్ను ఎంత ముందుకు నడిపించిందో నేను చెప్పలేను. కొన్ని విషయాల్లో క్లారిటీ వచ్చింది. నువ్వు చేసినప్పుడు.. నేనెందుకు చేయలేనని అనిపించింది. రిఫరెన్స్‌గా ఓ సక్సెస్‍ఫుల్ వ్యక్తిని తీసుకోవాలి. నేను పెద్దగా...