భారతదేశం, ఫిబ్రవరి 19 -- బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. ఈ పేర్లు వింటేనే వెండితెరపై ఒక మెరుపు కనిపిస్తుంది. వీరిద్దరితో ఒక్క సినిమా అయినా చేయాలని ఎంతోమంది రచయితలు, దర్శకులు ఏళ్ల తరబడి నిరీక్షిస్తుంటారు. అయితే, ప్రస్తుత ట్రెండ్‌కు భిన్నంగా ఆలోచించే దర్శకులు కూడా పరిశ్రమలో ఉన్నారు.

'పాతాళ లోక్', 'కోహ్రా' వంటి సూపర్ హిట్ ఓటీటీ సిరీస్‌లతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రచయిత-దర్శకుడు సుదీప్ శర్మ. తాజాగా షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్‌తో కలిసి సినిమా చేయాలనే ఇంట్రెస్ట్ తనకు ఏమాత్రం లేదని డైరెక్టర్ సుదీప్ శర్మ చెప్పడం షాకింగ్‌గా మారింది. అందుకు గల కారణాలు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.

డిజిటల్ కామెంటరీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుదీప్ శర్మ తన మనసులోని మాటను బయటపెట్టారు. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ వంటి...