భారతదేశం, జనవరి 24 -- ఈ ఏడాది సినీ లవర్స్ అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమాల్లో షారుక్ ఖాన్ హీరోగా నటించిన కింగ్ మూవీ ఒకటి. ఇందులో దీపికా పదుకొణే హీరోయిన్. ఈ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ ను శనివారం (జనవరి 24) మేకర్స్ అనౌన్స్ చేశారు. దీనిపై షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ రియాక్షన్ వైరల్ గా మారింది. కింగ్ సినిమాలో షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కూడా నటిస్తోంది.

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది! షారుక్ ఖాన్ తదుపరి చిత్రం 'కింగ్' విడుదల తేదీ ఖరారైంది. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. శనివారం.. మేకర్స్ ఒక నిమిషం నిడివి గల అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేశారు. కింగ్ రిలీజ్ డేట్ ను డిసెంబర్ 24, 2026గా ప్రకటించారు.

షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఈ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పై రియాక్టయ్యాడ...