భారతదేశం, నవంబర్ 20 -- నటుడు వివేక్ ఒబెరాయ్.. ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ కీర్తి కాలక్రమేణా మసకబారే అవకాశం ఉందని, భవిష్యత్ తరాలకు అతని గురించి తెలియకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అతడు ఇటీవల పింక్‌విల్లాతో మాట్లాడుతూ.. కీర్తి అనేది అస్థిరమైనదని, పరిమిత కాలానికే ఉంటుందని అతడు అన్నాడు. ఈ సందర్భంగా షారుక్ ఖాన్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఎంతటి వారికైనా వాళ్ల కీర్తి.. కాలంతో పాటు ఎలా కనుమరుగవుతుందో వివరిస్తూ వివేక్ ఒబెరాయ్ ఇలా అన్నాడు. "1960ల నుండి ఏదైనా సినిమా గురించి, అందులో నటించిన నటుల గురించి మీరు ఈ రోజు ఎవరినైనా అడగండి. ఎవరూ పట్టించుకోరు. మీరు అనివార్యంగా చరిత్రకు పరిమితమవుతారు. 2050లో ప్రజలు 'షారుక్ ఖాన్ ఎవరు?' అని అడగవచ్చు" అని వివేక్ అన్నాడు.

ఇదే చర్చలో వివేక్ ఒబెరాయ్.. దివంగత నటుడు రాజ్ కపూర్ కూడా ఉదహరించారు. "ఈ రో...