Hyderabad, అక్టోబర్ 1 -- బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ నెట్ వర్త్ ప్రతి ఏటా భారీగా పెరుగుతూ వెళ్తోంది. తాజాగా బుధవారం (అక్టోబర్ 1) హురున్ ఇండియా రిచ్ లిస్ట్ రిలీజ్ చేసిన జాబితాలో అతని పేరు బిలియనీర్ల జాబితాలో చేరడం విశేషం. ఇండియాలో మరే ఇతర నటుడు అతని దరిదాపుల్లోకి కూడా రాలేదంటే బాలీవుడ్ కింగ్ రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం షారుక్ ఖాన్ సంపద విలువ 1.4 బిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.12,490 కోట్లు. ఈ లిస్ట్ ప్రకారం షారుక్ ఖాన్, అతని కుటుంబం ఇండియాలో అత్యంత ధనిక బాలీవుడ్ సెలబ్రిటీలు. వారు రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను నడుపుతున్నారు. అలాగే ఐపీఎల్ ఫ్రాంచైజీ కేకేఆర్ సహ యాజమాన్యం, ఆల్కహాల్ కంపెనీలలో వాటాలు వంటి వివిధ రంగాలలో వాళ్ల ఫ్యామిలీకి భారీ పెట్టుబడులు ఉన్నాయి.

షారుక్ ఖాన్ సంపదకు ప్రధాన క...