భారతదేశం, ఆగస్టు 27 -- తయారీలో లోపాలున్న ఓ వాహనానికి సంబంధించిన మోసం కేసులో బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణెతో పాటు హ్యుందాయ్ కు చెందిన ఆరుగురు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. షారుక్, దీపికా హ్యూందాయ్ ఆటోమొబైల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. రాజస్థాన్ లోని భరత్ పూర్ లో ఎఫ్ఐఆర్ నమోదైందని భాస్కర్ ఇంగ్లిష్ రిపోర్ట్ తెలిపింది.

2022లో కొనుగోలు చేసిన హ్యుందాయ్ అల్కాజర్ ఎస్యూవీలో కొన్ని నెలల్లోనే సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని స్థానికుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. పలుమార్లు ఫాలోఅప్ చేసినప్పటికీ సమస్యలను పరిష్కరించడంలో కంపెనీ విఫలమైందని ఆరోపించారు. రాజస్థాన్ లోని భరత్ పూర్ కు చెందిన కీర్తి సింగ్ అనే వ్యక్తి హ్యుందాయ్ కంపెనీ కారును రూ.23 లక్షలకు పైగా వెచ్చించి కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫిర్యాద...