భారతదేశం, డిసెంబర్ 15 -- ప్రతి రోజూ కొత్త రికార్డులు సృష్టిస్తూ, అంచనాలకు మించి దూసుకుపోతోంది 'దురంధర్'. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ హిందీ సినిమాల చరిత్రలోనే అత్యుత్తమ రెండో వారాంతపు వసూళ్లను నమోదు చేసింది.

కేవలం 10 రోజుల్లోనే ఏకంగా రూ. 500 కోట్ల మార్కును అధిగమించింది దురంధర్ సినిమా. ఇదే ఊపు కొనసాగితే, రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ చిత్రం ఈ సంవత్సరంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచేందుకు సిద్ధంగా ఉంది.

'దురంధర్' రెండో ఆదివారం ఏకంగా రూ. 59 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో రెండో వారాంతపు దేశీయ వసూళ్లను రూ. 144.50 కోట్లతో ముగించింది. ఇది తొలి వారాంతపు కలెక్షన్లతో పోలిస్తే దాదాపు 40 శాతం అధికం కావడం గమనార్హం.

కేవలం పది రోజుల్లోనే దురంధర్ సినిమా భారతదేశంలో రూ. 351.75 కోట్ల నెట్, రూ...