భారతదేశం, జనవరి 7 -- షారుక్ ఖాన్.. బాలీవుడ్ లో అదిరే సినిమాలతో బాద్ షా గా ఎదిగాడు. రోహిత్ శర్మ.. క్రికెట్లో అదుర్స్ అనిపించే ఆటతీరుతో హిట్ మ్యాన్ గా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఇద్దరూ పక్కపక్కన కూర్చుని మాట్లాడుతున్న వీడియో వైరల్ గా మారింది. వీళ్లను ఇలా కలిసి సినిమాలో బిగ్ స్క్రీన్ పై చూడాలని ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, క్రికెటర్ రోహిత్ శర్మ ఇటీవల ముంబైలో జరిగిన యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ ఈవెంట్ లో కలుసుకున్నారు. వీరిద్దరికి సంబంధించిన అనేక వీడియోలు, ఫొటోలు వైరల్ గా మారాయి. షారుక్ ఖాన్, రోహిత్ శర్మ ముంబయి ఈవెంట్ లో మాట్లాడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఒకరి పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నారు.

రోహిత్ శర్మను షారుక్ ఏదో అడిగినట్లు కనిపించింది. రోహిత్ మాట్లాడుతుండగా షారుక్ కూడా తల ఊపాడు. నటుడు చప్పట్...