భారతదేశం, డిసెంబర్ 7 -- దర్శకుడు రాజ్ నిడిమోరు పెళ్లి తర్వాత ఫస్ట్ టైమ్ పబ్లిక్ గా కనిపించాడు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, రాజ్ నిడిమోరు డిసెంబర్ 1న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ వెంటనే వీళ్లిద్దరూ పనిలో బిజీ అయ్యారు. శనివారం రాజ్ తన తాజా సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ 3' విజయాన్ని పురస్కరించుకుని జరిగిన సక్సెస్ పార్టీకి హాజరయ్యారు. అక్కడ సమంతతో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినందుకు ఫోటోగ్రాఫర్లు ఆయనకు అభినందనలు తెలిపారు.

కోయంబత్తూర్‌లోని 'ఈషా యోగా సెంటర్'లో నివాహం చేసుకున్న కొద్ది రోజులకే రాజ్ నిడిమోరు తిరిగి పబ్లిక్‌లోకి వచ్చారు. దర్శకుడు శనివారం 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3' సక్సెస్ పార్టీలో వివాహానంతరం మొదటిసారి కనిపించారు. ఆయన తన భాగస్వామి కృష్ణ డీ, సిరీస్ స్టార్ మనోజ్ బాజ్‌పేయ్‌లతో కలిసి పార్టీ వేదిక బయట కనిపించారు. రా...