భారతదేశం, అక్టోబర్ 26 -- బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ను పాకిస్థాన్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్చడం కలకలం రేపుతోంది. అబుదాబిలో బలూచిస్తాన్ గురించి సల్మాన్ చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. దీంతో అతను వివాదంలో చిక్కుకున్నాడు. ఈ ఘటన పాకిస్థాన్ కు తీవ్రమైన కోపం తెప్పించింది. అందుకే సల్మాన్ ఖాన్ ను ఉగ్రవాదిగా పేర్కొంది. ఈ విషయం సంచలనంగా మారింది.

యాంటీ-టెర్రరిజం యాక్ట్ (1997)లోని 4వ షెడ్యూల్‌లో సల్మాన్ ఖాన్ పేరును పాకిస్థాన్ చేర్చినట్లు సమాచారం. యాంటీ-టెర్రరిజం యాక్ట్ (1997)లోని 4వ షెడ్యూల్ అనేది ఉగ్రవాదంతో సంబంధాలు ఉన్నాయని అనుమానించే వ్యక్తుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన జాబితా. దీంతో పాకిస్తాన్ సల్మాన్ ఖాన్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిందని కన్ఫామైంది. మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం ఈ విషయాన్ని బలూచిస్తాన్ ప్రభుత్వ హోం శాఖ అక్టో...